బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ అయిన మాజీ ఎమ్మెల్సీ కవిత మరోసారి వార్తల్లో నిలిచారు. ఒక ఇంటర్వ్యూలో ఆమె తండ్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై కీలక వ్యాఖ్యలు చేశారు. నా సస్పెన్షన్ ఉత్తర్వులపై కేసీఆర్ సంతకం లేకపోయినా ఆయన అసలు ఉద్దేశం ఇప్పుడు అర్థమైందని కవిత తెలిపారు.
తనను పార్టీ నుంచి సస్పెండ్ చేయడం బాధగా అనిపించిందని, తాను ఎప్పుడూ పార్టీ వ్యతిరేకంగా పనిచేయలేదని ఆమె స్పష్టం చేశారు. కొంతమంది కారణంగానే ఇది జరిగింది. కుటుంబానికి దూరమవడం తేలికైన విషయం కాదని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ కామెంట్స్ తో కేసీఆర్ నిర్ణయంపై కొత్త చర్చ మొదలైంది. కవిత సొంత పార్టీ ఏర్పాటు దిశగా అడుగులు వేస్తున్నారన్న వార్తల మధ్య, ఆమె ఎమోషనల్ కామెంట్స్ మహిళా సెంటిమెంట్‌ను టచ్ చేస్తున్నాయని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
అలాగే జూబ్లీహిల్స్ ఉపఎన్నిక, స్థానిక ఎన్నికల్లో ఎవరికి మద్దతు ఇవ్వకుండా దూరంగా ఉండాలనే ఆలోచనలో కవిత ఉన్నట్లు తెలుస్తోంది. పార్టీ నిర్మాణం పూర్తయ్యే వరకు సమయం తీసుకోవాలని ఆమెకు సీనియర్ నేతలు సూచించినట్లు సమాచారం.
ప్రస్తుతం కవిత ప్రజల్లో మళ్లీ తన ఉనికి చాటుకునే ప్రయత్నంలో ఉన్నారని, సెంటిమెంట్ రాజకీయాలతో ఫాలోయింగ్ పెంచే వ్యూహం సిద్ధం చేస్తున్నారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

