ప్రముఖ పారిశ్రామిక దిగ్గజాలు ఆనంద్ మహీంద్రా, హర్ష్ గోయెంకా సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉంటారు. సమాజం, స్ఫూర్తిదాయక అంశాలపై వీరి విశ్లేషణలు తరచూ చర్చకు దారితీస్తాయి. తాజాగా RPG గ్రూప్ చైర్మన్ హర్ష్ గోయెంకా పెట్టిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఆయన ఒక ఫోటోని పోస్ట్ చేశారు. అందులో రష్యా అధ్యక్షుడు పుతిన్, ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూ తమ పెంపుడు జంతువులతో కనిపిస్తుండగా, భారత ప్రధాని నరేంద్ర మోదీ పుంగనూరు ఆవుతో ఉన్నారు. మరో ఫ్రేమ్‌లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో పాటు పాకిస్థాన్ ప్రధాని షెహ్‌బాజ్ షరీఫ్, ఆ దేశ సైన్యాధిపతి ఆసిం మునీర్ ఉన్నారు.
దీనికి ప్రపంచ నాయకులు తమ ఇష్టమైన పెంపుడు జంతువులతో అనే క్యాప్షన్ జోడించారు. అంటే అమెరికాకు పెంపుడు జంతువు పాకిస్థాన్ అనే అర్థంలో ఈ వ్యంగ్య ట్వీట్ పెట్టారు.
ఉగ్రవాదానికి అడ్డాగా ఉన్న పాకిస్థాన్‌ను అమెరికా ఇప్పటికీ మిత్రదేశంగా చూసుకోవడం, ఆయుధాలు విక్రయించడం పట్ల హర్ష్ గోయెంకా ఈ వ్యంగ్య ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌పై నెటిజన్లు ఫన్నీ మీమ్స్‌తో స్పందిస్తున్నారు.

