మాజీ మంత్రి, వైఎస్ రాజశేఖర్ రెడ్డి సోదరుడు వైఎస్ వివేకానందరెడ్డి 2019లో పులివెందులలో తన ఇంట్లోనే దారుణ హత్యకు గురయ్యారు. ఆరున్నరేళ్లు గడుస్తున్నా, అసలైన నిందితులు ఎవరో ఇంకా తేలలేదు.
ఈ కేసు మొదట స్థానిక పోలీసుల నుంచి సీబీఐకు బదిలీ చేయబడింది. సుదీర్ఘంగా విచారణ చేసిన సీబీఐ తాజాగా సుప్రీంకోర్టుకు తమ ఇన్వెస్టిగేషన్ పూర్తయిందని తెలిపింది.
కానీ ప్రజల్లో మాత్రం ఇప్పుడు ఎన్నో ప్రశ్నలు మొదలయ్యాయి అసలు హంతకులు ఎవరు? సూత్రధారులు ఎవరు? విచారణ పూర్తయిందంటే దోషుల వివరాలు చెప్పాలి కదా అనే చర్చ సాగుతోంది.
ఇప్పుడు చూపు మొత్తం సుప్రీంకోర్టు వైపే. తదుపరి ఆదేశాలు ఎకా ఉంటాయో అని ఈ కేసు తీర్పు కోసం చూస్తున్నారు.. వివేకానందరెడ్డి కుమార్తె సునీత పట్టు విడవకుండా కేసు నీరుగారకుండా, కోర్టు మెట్లు ఎక్కుతూనే ఉన్నారు. ఎంపి అవినాష్ రెడ్డి అసలైన దోషి అని ఆమె బహిరంగంగా చెప్తున్నారు. మరి సిబిఐ ఫైల్ లో ఏముందో తెలియాలి.

