వైసీపీ అధినేత జగన్ ప్రైవేట్ సైన్యం ఏర్పాటు దిశగా అడుగులు వేశారని వార్తలు వస్తున్నాయి. సుమారు 200 మందికి పైగా ప్రైవేట్ సైన్యాన్ని జగన్ వ్యక్తిగత భద్రత కోసం నియమించారని అంతటా చర్చ సాగుతోంది. ప్రభుత్వం తనకు తగినంత భద్రత ఇవ్వడం లేదని ఆరోపించిన జగన్, ఈ విషయంపై హైకోర్టులో పిటిషన్ కూడా వేశారు.
రెంటపాళ్ళ పర్యటనలో జరిగిన సంఘటనలు, నెల్లూరు పర్యటనలో చోటు చేసుకున్న భద్రతా లోపాలపై వైసీపీ ఆగ్రహంగా ఉంది. ఈ నేపథ్యంలో ప్రైవేట్ సెక్యూరిటీ ఏర్పాటుతో జగన్ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టే వ్యూహం చేస్తున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు.
ప్రైవేట్ సైన్యం నేరం కాదు, అయినా, అధికారికంగా అనుమతి లేకుండా ప్రైవేటు సైన్యంతో పర్యటనలకు వెళ్తే రాజకీయ దుమారం రేగడం ఖాయమని అంటున్నారు. ప్రభుత్వం–ప్రతిపక్షం మధ్య భద్రతా యుద్ధం ప్రజల్లో ఉత్కంఠగా మారింది. మటజీ సిఎమ్ జగన్ కి భద్రత విషయంలో ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు తీసుకున్నట్టు హోం మంత్రి అనిత అంటున్నారు.

