ఆంధ్రప్రదేశ్ సీనియర్ ఐపీఎస్ అధికారి ఎన్.సంజయ్ ని ఏసీబీ అధికారులు విచారణ చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,
తాను ఒక్క రూపాయి అవినీతికి పాల్పడలేదని
రాజకీయ కక్షతోనే కేసులు పెట్టారని
తన ఉద్యోగ జీవితమే తన నిజాయితీకి నిదర్శనమని చెప్పారు.
జగన్ ప్రభుత్వంలో ఇంటెలిజెన్స్ చీఫ్‌గా పనిచేసిన సమయంలో చంద్రబాబు అరెస్టు కేసులో తాను కేవలం ప్రభుత్వ ఆదేశాల ప్రకారమే వ్యవహరించానని సంజయ్ స్పష్టం చేశారు. ప్రభుత్వం చెప్పినట్టు ఎవరైనా చేయాల్సిందే కదా.. మీరైనా చేయాల్సిందే కదా.. అంటూ కామెంట్ చేసినట్టు సమాచారం.
అగ్నిమాపక శాఖ డీజీగా ఉన్నప్పుడు నిధుల దుర్వినియోగం చేశారనే ఆరోపణలపై ప్రస్తుతం కేసు విచారణ సాగుతోంది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఏసీబీ కోర్టులో లొంగిపోయిన సంజయ్, మూడు రోజుల పాటు విచారణ ఎదుర్కొంటున్నారు.
నా ఇల్లు, ఆస్తులు పరిశీలించండి… ఏ అవినీతి జాడ దొరకదు అని ధైర్యంగా చెప్పినట్లు తెలుస్తోంది. కొన్ని ప్రశ్నలకు తెలియదు గుర్తులేదు అని చెప్పడం కొసమెరుపు.

