కెసిఆర్ పరుగుకు కళ్ళెం: రేవంత్ రెడ్డి

మాజీ సీఎం కేసీఆర్ టైమ్‌లో రాష్ట్రంలో సీబీఐ దర్యాప్తుల కోసం సర్కారు అనుమతి తప్పనిసరి అని నిర్ణయించిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, సీబీఐకి సంబంధించిన ఆంక్షలను సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం తొలగించింది.
తాజాగా, కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో అవినీతిపై పీసీ రిపోర్ట్ ఆధారంగా సీబీఐ దర్యాప్తు కోసం రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర హోం శాఖకు లేఖ రాసింది. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చిన నివేదికను పరిశీలించి, సీబీఐ దర్యాప్తు అవసరమని తెలిపింది.
ఇప్పుడున్న పరిస్థితిలో సీబీఐ సక్రమంగా ఈ కేసును పరిశీలించగలదా, కేంద్రం అనుమతిస్తుందా అనేది చూడాలి. ఈ కేసులో మాజీ మంత్రి ఈటల రాజేందర్ కూడా ఒక వర్గమే.
సాధారణంగా, సీబీఐ దర్యాప్తు ప్రారంభమైతే, బాధితులు, అనుబంధ వ్యక్తులు విచారణను ఎదుర్కోవాల్సివస్తుంది. బిజెపి లీడర్ ఈటెల కూడా విచారణ ఎదుర్కోవాల్సి వస్తుంది. చూద్దాం కెసిఆర్ భవిష్యత్తు ఎలా ఉందో..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *