“””””””””””””””””””””””””””
ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నిక ఫలితంపై కామెంట్స్ చేశారు. టీడీపీ అక్రమ పద్ధతుల్లో గెలిచి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిందని వైసిపి అనడం చూస్తే నవ్వొస్తుందని, వైసీపీ కూడా ఇలాగే చేసినప్పుడు గుర్తు లేదా ఆమె విమర్శించారు. విజయవాడలో ఆంధ్రరత్న భవన్‌లో స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా జెండా ఆవిష్కరించిన షర్మిల, సీఎం చంద్రబాబు–మాజీ సీఎం జగన్ పోటాపోటీ రాజకీయాలు తాలిబాన్ తరహాలో ఉన్నాయని మండిపడ్డారు. పులివెందుల ఓటమి వైఎస్ కుటుంబానికి పెద్ద దెబ్బ అని, జగన్ గతంలో చేసిన తప్పులే ఇప్పుడు తనను దెబ్బతీస్తున్నాయని, వ్యాఖ్యానించారు. చంద్రబాబు ప్రత్యక్షంగా, జగన్ రహస్యంగా మోదీకి మద్దతిస్తున్నారని, కాంగ్రెస్ మాత్రమే ప్రజాస్వామ్యాన్ని కాపాడగలదని షర్మిల పిలుపునిచ్చారు. మోదీ నయాభారత్ పేరుతో రాజ్యాంగాన్ని మార్చే ప్రయత్నం చేస్తున్నారని, ఇది నిజానికి “దగా భారత్” అని ఆమె విమర్శించారు.
షర్మిల మాట్లాడుతూ దేశం బ్రిటిష్ చేతిలో బందీ అయినట్టే ఇప్పుడు మోదీ చేతిలో బందీ అవుతోందని ఆమె తీవ్రస్థాయిలో వ్యాఖ్యానించారు.

