అనంతపురంలో వార్-2 సినిమా రిలీజ్ తో పెద్ద రచ్చ జరిగింది. జూనియర్ ఎన్టీఆర్‌పై ధారుణమైన కామెంట్స్ చేశారంటూ అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్‌పై ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక ఆడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో వందలాది మంది అభిమానులు ఎమ్మెల్యే కార్యాలయం ముందు ధర్నాకు దిగారు. జూనియర్ సినిమాలు ఆడనివ్వనంటూ ఎమ్మెల్యే హెచ్చరించారనే ఆరోపణలు వినిపించాయి. అయితే, తాను ఎప్పుడూ దూషించలేదని, నందమూరి కుటుంబమంటే ఎంతో అభిమానమని ఎమ్మెల్యే వీడియో విడుదల చేశారు. ఫేక్ ఆడియో, వీడియోలు సృష్టించి ప్రచారం చేస్తున్నారని స్పష్టంచేసిన ఆయన, ఫ్యాన్స్ బాధపడి ఉంటే క్షమించాలని కోరారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే పోలీసులకు ఫిర్యాదు చేసి, విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీని కోరారు. ప్రస్తుతం అనంతపురంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
ఫ్యాన్స్ మాత్రం ఎమ్మెల్యే బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు పోలీసులు పరిస్థితిని అదుపులో ఉంచేందుకు భద్రతా ఏర్పాట్లు చేశారు.

