ఏపీలో లిక్కర్ స్కామ్ కేసు మరింత వేగం పుంజుకుంది. దీంతో
జగన్ అరెస్ట్‌పై చర్చలు వేడెక్కుతున్నాయి. గతేడాది సెప్టెంబర్ నుంచి కొనసాగుతున్న SIT ఇన్వెస్టిగేషన్ ప్రస్తుతం చివరి దశకు వచ్చింది. వైసీపీకి చెందిన పలువురు నేతల అరెస్ట్‌లు, ఎంపీ మిధున్ రెడ్డి అరెస్ట్.. అందరిలోనూ చర్చలు మళ్లీ జోరందుకున్నాయి. ఇక మిగిలింది జగన్ అనే మాట వినిపిస్తోంది.
బీజేపీ నేతలు కూడా జగన్‌పై హాట్ కామెంట్స్ చేస్తున్నారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్, కేంద్ర మంత్రి సత్యకుమార్ యాదవ్ ఇద్దరూ జగన్ అరెస్ట్ ఖాయమని బహిరంగంగానే అన్నారు..
టీడీపీ, జనసేన నేతలు కూడా ఇదే మాటను చెప్తున్నారు.. జగనే లిక్కర్ స్కామ్ బిగ్ బాస్ అని అంటున్నారు. ప్రజల ఆరోగ్యాలు, ప్రాణాలతో ఆడుకున్నారని విమర్శిస్తున్నారు. లిక్కర్ స్కామ్ తో రాష్ట్ర ఖజానాను దోచుకున్నారని అంటున్నారు.

