ట్రైన్ నుండి జారిపడిన వ్యక్తి, వెనక్కి ట్రైన్

గుంటూరు జిల్లా పొన్నూరు మండలానికి చెందిన 35 ఏళ్ల హరిబాబు, స్నేహితులతో కలిసి యలహంకలో భవన పనులకు బయలుదేరాడు. కోండవీడు ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణిస్తున్న అతను, ప్రకాశం జిల్లా గజ్జల కొండ దాటిన తర్వాత వాష్ బేసిన్ వద్ద చేతులు కడుకుంటుండగా, రైలు కుదుపుకు జారిపడ్డాడు.
తోటి ప్రయాణికులు వెంటనే స్నేహితులకు తెలియచేశారు. రైలు వేగంగా వెళ్తున్నప్పటికీ, లోకో పైలెట్ అనుమతితో రైలు వెనక్కి తీసుకెళ్ళారు. దాదాపు ఒకటిన్నర కిలోమీటర్ల వరకు వెళ్ళింది. ట్రాక్ పక్కన హరిబాబును గాయాలతో గుర్తించారు. వెంటనే రైల్లోకి ఎక్కించి, తరువాత 108 వాహనంతో ఆసుపత్రికి తరలించారు.
అయితే, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో హరిబాబు మృతిచెందాడు. ఈ ఘటన అక్కడున్నవారిని తీవ్రంగా కలచివేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *