ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. కల్తీ లిక్కర్ కేసు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ ఇష్యూలో టీడీపీ, వైసీపీ మధ్య మాటల యుద్ధం సాగుతోంది.
నిందితుడు జనార్ధనరావు వీడియో క్లిప్ బయటకు రావడంతో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. మాజీ మంత్రి జోగి రమేష్ పేరును ప్రస్తావించినందుకు టీడీపీ వైసీపీపై తీవ్రంగా దాడి చేస్తోంది. సీబీఐ విచారణ కోరిన వైసీపీ ఇప్పుడు డిఫెన్స్‌లో పడినట్లు కనిపిస్తోంది.
వైసీపీ ఆరోపణలలోనే “కల్తీ” ఉందని టీడీపీ హేళన చేస్తుంది. మరోవైపు జగన్ లండన్ పర్యటనలో ఉండటంతో పార్టీ వ్యూహాత్మకంగా స్పందించే అవకాశం తగ్గిపోయిందని నేతలు చెబుతున్నారు.
జగన్ ఈ నెల 23 తర్వాతే రాష్ట్రానికి రానున్నారు. అప్పటికి కల్తీ లిక్కర్ ఇష్యూ పూర్తి వేడి తగ్గే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా టీడీపీ ఈ అంశాన్ని బలంగా ఎత్తి చూపుతూ వైసీపీపై ఒత్తిడి పెంచుతోంది.
కల్తీ లిక్కర్ స్కాం వల్ల వైసీపీ సరిగ్గా స్టాండ్ తీసుకోలేకపోతుంది. టీడీపీ దూకుడు పెంచింది. రాబోయే రోజుల్లో ఈ ఇష్యూ ఏ మలుపు తిరుగుతుందో చూడాలి.

