వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రస్తుతం లండన్ పర్యటనలో ఉన్నారు. అయితే, రాష్ట్రంలో జనసేనకు సంబంధించిన వివాదాలపై ఆయన కీలక ఆదేశాలు ఇచ్చినట్టు తెలుస్తోంది. పార్టీ నాయకులు ఎవరూ జనసేన విషయాలపై మాట్లాడొద్దని, వ్యాఖ్యలు చేయొద్దని స్పష్టం చేసినట్టు సమాచారం.
ఇటీవల శ్రీకాళహస్తి, కురుపాం నియోజకవర్గాల్లో జనసేన నేతల వ్యవహారాలు పెద్ద చర్చకు దారితీశాయి. శ్రీకాళహస్తిలో మాజీ నాయకురాలు వినుత భర్త చంద్రబాబుపై దాడి ప్రయత్నం వీడియో వైరల్ అవగా, కురుపాంలో జనసేన ఎంపీపీపై టిడిపి నేతలు దాడి చేశారు. ఈ ఘటనలు రెండు పార్టీల మధ్య ఉత్కంఠను పెంచాయి.
అయితే, ఈ విషయాలపై అసలు స్పందించవద్దని వైసిపి నేతలకు జగన్ సూచన చేసినట్టు తాడేపల్లి వర్గాలు చెబుతున్నాయి. దీంతో వైసీపీ నాయకులు ప్రెస్‌మీట్లు వాయిదా వేసినట్టు సమాచారం.
ఇక రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం, జాతీయ స్థాయిలో జరుగుతున్న మార్పుల నేపథ్యంలో వైసీపీ ఈ నిర్ణయం తీసుకుందని అంటున్నారు. ఎన్నాళ్లవరకు ఈ మౌనం కొనసాగుతుందో చూద్దాం.

