ఏపీలో రాజకీయాలు రోజురోజుకూ వేడెక్కుతున్నాయి. గత కొన్నేళ్ళుగా రాజకీయ కక్ష సాధింపులు ఎక్కువైపోయాయి. గత వైసీపీ ప్రభుత్వం టిడిపి నాయకులపై, కార్యకర్తలపై కేసులు వేసి, ఇబ్బందులు పెట్టిన సంగతి తెలిసిందే. స్కిల్ డెవలప్‌మెంట్ పేరుతో భారీ అవినీతి జరిగిందని అప్పటి వైసిపి ప్రభుత్వం టీడీపీ అధినేత చంద్రబాబును దాదాపు రెండు నెలలపాటు జైల్లో పెట్టింది. కూటమి ప్రభుత్వం రావడంతో కొందరు వైసీపీ నేతలు జైళ్లకు వెళ్ళారు. మరికొంత మంది లైన్లో ఉన్నారు. ఏపీ లిక్కర్ స్కామ్ లో వైసీపీకి చెందిన నాయకులు అరెస్ట్ అవుతున్నారు. ఇప్పటికే చెవిరెడ్డి భాస్కరరెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డిలు అరెస్టయ్యారు. ఈ కేసులో మాజీ సీఎం జగన్ కూడా రేపోమాపో అరెస్ట్ అవుతారనే ప్రచారం జరుగుతోంది. భారీగా డబ్బు బయటపడటం, వీడియోల్లో కనిపించడంతో పాటు కీలక నిందితుడు వెంకటేశ్ నాయుడుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు మరింత అనుమానాలకు దారి తీస్తుంది. వెంకటేశ్ నాయుడు సినీ నటి తమన్నాతో ప్రైవేట్ విమానంలో ఉండటం, ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితతో కలిసిన ఫొటోలు, బిజెపి, టిడిపి, నాయకులతో దిగున ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

