వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఈసారి ఒక సినిమాను ఆకాశానికి ఎత్తేశాడు. తాజాగా విడుదలైన మిరాయ్ చూసిన తర్వాత ఆయన సోషల్ మీడియాలో తన స్పందనను పంచుకున్నారు. ఈ సినిమాలోని విజువల్స్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, స్క్రీన్‌ప్లే అద్భుతంగా ఉన్నాయని వర్మ ప్రశంసించారు.
హీరో తేజ సజ్జా నటన తనను ఆశ్చర్యపరిచిందని, మొదట అనుమానం ఉన్నా తర్వాత పప్పులో కాలేశానని వర్మ చెప్పుకొచ్చాడు. అలాగే మనోజ్ ది యాక్టింక్ లా కాకుండా.. చాలా రియలిస్టిక్ గా ఉందని మెచ్చుకున్నాడు. దర్శకుడు కార్తీక్ డైరెక్షన్‌కి ఫిదా అంటూ.. కథ, పురాణం, హీరోయిజం, టెక్నికల్ పనితనాన్ని అద్భుతంగా మేళవించారని పేర్కొన్నాడు.
ప్రొడ్యూసర్ టీజీ విశ్వప్రసాద్ ధైర్యాన్ని గుర్తు చేస్తూ, సినిమా కుటుంబ నేపథ్యం లేకపోయినా తన ఇంట్రెస్ట్ పై నమ్మకం ఉంచి ఈ ప్రాజెక్ట్‌కి రూపం ఇచ్చారని వర్మ అభిప్రాయపడ్డాడు. మిరాయ్ ఒక చిన్న సినిమా పెద్దగా కనిపించాలనుకోలేదఇది నిజంగా ఒక పెద్ద సినిమా అని వర్మ చెప్పుకొచ్చాడు. చివరగా మొత్తం చిత్రబృందానికి అభినందనలు తెలుపుతూ, ఈ సినిమా ప్రేక్షకులకు జ్ఞాపకాలుగా నిలుస్తుందని పేర్కొన్నారు.

