జగన్ చుట్టూ కోటరీనా?

వైసీపీ అధినేత జగన్‌ ఏ వ్యూహం వేస్తున్నారో, రాజకీయాన్ని ఎలా మలుస్తారో స్పష్టంగా తెలియకపోయినా, ఆయనకు దగ్గరవారు మాత్రం బహిరంగంగా సూచనలు ఇస్తున్నారు. పార్టీకి నిజమైన బలం క్యాడర్‌ అని, వారిని పట్టించుకోవడమే విజయానికి మార్గమని హితులు చెబుతున్నారు.
జగన్ చుట్టూ ఉన్నవారు ఎక్కువగా ఎమ్మెల్యేలు, ఎంపీలు, పెద్ద నాయకులే. కానీ వీరు హైప్రొఫైల్‌గా ఉంటారు, ప్రజల మధ్యకు రారు. నిజమైన ప్రజాభిప్రాయాలు, గ్రౌండ్ స్థితి కార్యకర్తలకు బాగా తెలుసు. కేవలం మీటింగులు, ఫోటో సెషన్‌లు కాకుండా, కార్యకర్తలతో నేరుగా కలవాలని అంటున్నారు.
ఎన్నికల సమయంలో ఓటు వేయించేది పెద్ద నాయకులు కాదు, కార్యకర్తలేనని, ప్రజలు ఎక్కువగా పార్టీగుర్తును చూసి ఓటేస్తారని అన్నారు, అభ్యర్థి ఎవరో తక్కువమందికే తెలుసు. అందుకే పార్టీ జెండా నిలబెట్టేది కర్ర అయితే, పార్టీని నిలబెట్టేది కార్యకర్తలని జగన్ కి తెలిపారు.
తమిళనాడులో డీఎంకే, ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ లాంటి పార్టీల విజయాలకు కారణం కూడా బలమైన క్యాడరే అని గుర్తుచేస్తున్నారు. కేసులు, ఇబ్బందులు, ప్రతిబంధకాలు ఉన్నా పార్టీ కోసం ముందుండే వారు కార్యకర్తలు.
అందుకే జగన్ క్యాడర్‌తో మమేకం కావాలి. వారి మాట వినడం, వారిని ప్రోత్సహించడం చేయాలి. ఇది జగన్ తెలుసుకోవాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *