రాష్ట్రంలో గిరిజన ఓటు బ్యాంకు సుమారు 10-12 శాతం ఉంది. ఓటు పర్సంటేజ్ తక్కువున్నా ఈ ఓట్లు అనేక నియోజకవర్గ ఫలితాలపై ప్రభావం చూపిస్తాయి. కేవలం గిరిజన ప్రాంతాల్లోనే కాకుండా, సాధారణ నియోజకవర్గాల్లో ఉన్న ఎస్టీSTఓటర్లపై కూడా ఈ ప్రభావం ఉంటుంది.
గతంలో కాంగ్రెస్కు మద్దతుగా ఉన్న గిరిజన ఓటు బ్యాంకు, గత రెండు ఎన్నికల్లో వైసీపీ వైపు వెళ్లింది. 2019లో గిరిజన నియోజకవర్గాల్లో వైసీపీ విజయం సాధించింది. అయితే, 2024 ఎన్నికల సమయంలో కూటమి పార్టీల దూకుడుతో వైసీపీ ఆధిక్యం కొంత తగ్గింది.
ఈ పరిస్థితిలో, జనసేన గిరిజనుల మనసు గెలుచుకునే విధంగా ప్లాన్ చేసింది. మన్యం, పోలవరం వంటి ప్రాంతాల్లో అభివృద్ధి పనులు, రహదారుల నిర్మాణం, చెప్పులు, మామిడికాయలు, చీరలు పంపిణీ వంటి కార్యక్రమాలతో గిరిజన ఓటు జనసేన వైపు మళ్లుతోందనే చర్చ మొదలైంది.
మరోవైపు, టీడీపీ కూడా ఈ పోటీలో వెనుకబడకుండా ప్లాన్ చేసుకుంటుంది. మన్యం జిల్లాలో పర్యటించిన చంద్రబాబు, గిరిజనుల సమస్యలను తెలుసుకున్నారు. పార్టీ నాయకులకు వైసీపీ దూకుడును ఎదుర్కోవాలని సూచించారు. జనసేన నాయకులు తిరుగుతున్న చోట టీడీపీ నాయకులు కూడా జనాలకు దగ్గరవ్వాలని స్పష్టం చేశారు.
మొత్తానికి, గిరిజన ఓటు కోసం వైసీపీ, జనసేన, టీడీపీ బరిలో దిగాయి. రాబోయే ఎన్నికల్లో ఈ ఓటు బ్యాంకు ఎవరి వైపు మళ్లుతుందనే దానిపై రాష్ట్ర రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి.

