టాలీవుడ్‌లో రూపుదిద్దుకుంటున్న భారీ బడ్జెట్ పాన్‌వరల్డ్ ప్రాజెక్ట్ SSMB 29పై ఆసక్తి రోజు రోజుకీ పెరుగుతోంది. ఇండియాస్ బిగ్గెస్ట్ డైరెక్టర్ ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వం, సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా నటిస్తుండటం ఈ సినిమాకు స్పెషల్ హైలైట్. ఆగస్టు 9న విడుదలైన ఫస్ట్ లుక్ గ్లింప్స్‌తో అంచనాలు మరింత పెరిగాయి.
ఇప్పటికే మూడు షెడ్యూళ్లు పూర్తయి, నాలుగో షెడ్యూల్ షూటింగ్ కొనసాగుతున్నట్టు సమాచారం. హాలీవుడ్ స్థాయిలో రూపొందుతున్న ఈ చిత్రం కోసం టాప్ టెక్నీషియన్లను హైర్ చేశారు. ఇండియన్ ఆడియెన్స్‌తో పాటు ఇంగ్లీష్ ఆడియెన్స్‌ను కూడా లక్ష్యంగా చేసుకుంటున్నారు.
సినిమా టైటిల్‌పై ఫిల్మ్ సర్కిల్స్‌లో టాక్ ఏమిటంటే.. కథను దృష్టిలో ఉంచుకొని GEN63 అనే టైటిల్ రిజిస్టర్ చేసినట్టు సమాచారం. మహేశ్ బాబు పాత్ర తన వంశంలో 63వ తరం వారసుడిగా, పూర్వీకుల శక్తులను తిరిగి పొందేందుకు ప్రయత్నించే యాక్షన్ అడ్వెంచర్‌గా కథ సాగుతుందట. ఇందులో హిందూ పురాణాలు, సైన్స్ ఫిక్షన్ కలబోతగా ఉండనుంది. అయితే ఈ టైటిల్‌పై ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు.

