వైయస్ జగన్ కి 11 శాపమేంటో?

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఇప్పుడు
అత్త కొట్టినందుకు కాదు.. తోడికోడలు నవ్వినందుకు అనే సామెతలా మారింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమి తరువాత తాజాగా జరిగిన రెండు జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లోనూ వైసీపీకి షాక్ తగిలింది. ముఖ్యంగా జగన్ బలమైన కోటగా భావించే పులివెందులలో కూడా ఓటమి పార్టీ క్యాడర్‌ను తీవ్ర నిరాశలోకి నెట్టింది. 2019లో 151 స్థానాలు గెలిచిన జగన్, 2024లో కేవలం 11 స్థానాలకు పరిమితం కావటం పార్టీపై పదకొండు అనే నంబర్ ప్రభావం దారుణంగా ఉంది. దీనిపై చర్చ మొదలైంది. తాజాగా జరిగిన ఉప ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు 11మంది కావటం, పులివెందుల నోటాకు 11 ఓట్లు రావడం, తాడేపల్లి సమావేశం ఉదయం 11 గంటలకు మొదలై నెగిటవ్ ఫలితాలు రావటం అన్నీ ఈ పదకొండు చుట్టూనే తిరుగుతున్నాయి. జగన్‌ను ఈ 11 ఇంకా ఎన్ని రోజులు వెంటాడుతుందో అన్నది రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
వైసీపీ భవిష్యత్తు ఏమవుతుందన్న అనుమానం పార్టీలోనూ, ప్రజల్లోనూ మరింత పెరుగుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *