నారా భువనేశ్వరి, అన్నా లెజినోవాల ఫోకస్

స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా రాజ్ భవన్‌లో జరిగిన ఎట్ హోం కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన సతీమణి అన్నా లెజినోవాతో కలిసి హాజరై అందరి దృష్టిని ఆకర్షించారు. సాధారణంగా అధికారిక కార్యక్రమాల్లో కనిపించని అన్నా, ఈసారి పవన్‌తో రావడం ప్రత్యేకం. ముఖ్యమంత్రి చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరితో అన్నా ముచ్చట్లాడుతూ కెమెరాలకు ఫోకస్‌ అయ్యారు. గవర్నర్ అబ్దుల్ నజీర్ పక్కన చంద్రబాబు, ఆయన పక్కన పవన్, పవన్ పక్కన నారా లోకేష్ కూర్చోవడం కూడా విశేషం. మొత్తానికి ఎట్ హోం వేడుకల్లో అన్నా లెజినోవా హైలైట్‌గా నిలిచారు. ఇదేరోజు పిఠాపురంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు కూడా పవన్ భార్యతో హాజరయ్యారు. మరోవైపు విజయవాడలో మహిళలకు ఉచిత బస్సు సేవ ప్రారంభోత్సవంలో చంద్రబాబు, పవన్ కలసి బస్సులో ప్రయాణించి ప్రజలకు సందేశం ఇచ్చారు. ఈ క్రమంలో టీడీపీ–జనసేన బంధం మరింత బలపడుతోందని, కూటమి ప్రభుత్వం ఏపీలో మరో పదిహేనేళ్లు కొనసాగాలనేది పవన్ ఆకాంక్ష అని స్పష్టమవుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *