విశాఖపట్నం సిటీ ఆఫ్ డెస్టినీ మాత్రమే కాదు “సిటీ ఆఫ్ ఏఐ”గా అవతరించబోతోంది. గూగుల్ సంస్థ విశాఖలో ప్రపంచ స్థాయి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్‌ను ఏర్పాటు చేయనుంది. రాబోయే ఐదేళ్లలో 15 బిలియన్ డాలర్లు సుమారు 1.25 లక్షల కోట్లు పెట్టుబడి పెట్టనుంది. ఇది అమెరికా వెలుపల గూగుల్ చేసిన అతి పెద్ద ఇన్వెస్ట్మెంట్.
ఈ ప్రాజెక్ట్‌తో విశాఖ ఇంటర్నేషనల్ కనెక్టివిటీ సెంటర్ గా మారనుంది. వన్ గిగావాట్ సామర్థ్యంతో డేటా సెంటర్ ఏర్పాటు చేసి, సముద్రగర్భ కేబుల్ వ్యవస్థ ద్వారా ప్రపంచ నెట్‌వర్క్‌తో అనుసంధానం చేయనున్నారు. దీంతో గూగుల్ సేవలు, యూట్యూబ్, జీమెయిల్, సెర్చ్ లాంటివి భారత్ నుంచే గ్లోబల్ స్థాయిలో అందుబాటులోకి రానున్నాయి.
ముఖ్యమంత్రి చంద్రబాబు విజన్ వల్లే ఈ అద్భుత అవకాశం ఆంధ్రప్రదేశ్‌కి దక్కిందని టెక్ వర్గాలు అంటున్నాయి. ఆయన చెబుతున్నట్లుగా, ఈ ఏఐ హబ్ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను మార్చే మైలురాయిగా నిలుస్తుంది. వేలాది ఉద్యోగాలు, యువతకు ఏఐ స్కిల్ డెవలప్మెంట్ లభించనున్నాయి.
రానున్న ఫిబ్రవరిలో విశాఖలో గ్లోబల్ ఏఐ కాన్ఫరెన్స్ నిర్వహించే ఆలోచనలో కేంద్ర ప్రభుత్వం ఉందని సీఎం తెలిపారు. మొత్తం మీద, విశాఖపట్నం ఇప్పుడు ప్రపంచ టెక్ మ్యాప్‌లో మెరిసే విశ్వ నగరంగా మారనుంది.

