యాత్రకు రెడీ టవుతున్న కవిత

తెలంగాణ రాజకీయాల్లో మరో పెద్ద మార్పుకు దారి తీసే పరిణామం ఇది. బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ అయిన కవిత, ఇప్పుడు తన సొంత అజెండాతో ముందుకు వెళ్తున్నారు. ఆమె ఈ నెలాఖరులో రాష్ట్రవ్యాప్తంగా పెద్ద యాత్రను ప్రారంభించబోతున్నారు. ఈ యాత్ర ద్వారా ప్రజల మనసు, తెలంగాణా రాజకీయాల దిశకు దగ్గరవ్వాలని చూస్తున్నారు.
కవిత ఈ యాత్రలో ఎక్కడా బీఆర్ఎస్ రంగు లేకుండా జాగ్రత్తపడుతున్నారని సమాచారం. ముఖ్యంగా తన తండ్రి కేసీఆర్ ఫోటో లేకుండా, తెలంగాణా ఉద్యమ వీరుడైన ప్రొఫెసర్ జయశంకర్ చిత్రపటంతో యాత్ర ప్రారంభించబోతున్నారు. ఇది రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అవుతోంది.. కేసీఆర్ పేరు లేకుండా ఆయన కుమార్తె పర్యటన చేయడం రాజకీయంగా పెద్ద సంచలనమేనని విశ్లేషకులు భావిస్తున్నారు.
కవిత ఇప్పటికే విద్యార్థులు, మేధావులు, సామాజిక ఉద్యమకారులు, ప్రజా సంఘాల నాయకులతో చర్చలు జరిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *