విశాఖలో గుడివాడ గడబిడ సొద

“”””””””””””””””””””””””””
వైసీపీ లో విశాఖ రాజకీయాలు మరోసారి హాట్ టాపిక్ అయ్యాయి. మాజీ మంత్రి గుడివాడ అమర్నాధ్ కు అనకాపల్లి జిల్లా అధ్యక్ష బాధ్యతలు అప్పగించినా, ఆయన దృష్టి మాత్రం విశాఖపైనే ఉందని పార్టీ లోపలే చర్చ సాగుతోంది. మరోవైపు, 2019, 2024లో వరుసగా ఓడిపోయినా పార్టీ పట్ల విధేయతను చూపిన కేకే రాజు కు విశాఖ జిల్లా అధ్యక్ష బాధ్యతలు జగన్ ఇచ్చారు. ఆయన నాయకత్వంలో జరిగిన స్థాయీ సంఘం ఎన్నికల్లో వైసీపీ ఒక కీలక సీటు గెలుచుకోవడం పార్టీకి ఊపిరి ఇచ్చింది. దీంతో హైకమాండ్ ఆయన పనితీరు పట్ల సంతృప్తిగా ఉందని చెబుతున్నారు. కానీ అమర్నాధ్ మీడియా ముందు మాత్రమే చురుగ్గా కనిపిస్తారని, తనకు అప్పగించిన జిల్లాలో పని చేయడం లేదని విమర్శలు ఉన్నాయి. ఆయన చూపు విశాఖలోని భీమిలీ లేదా ఉత్తర నియోజకవర్గం సీటుపైనే ఉందని రాజకీయ వర్గాల టాక్. మొత్తానికి విశాఖలో ఒకేసారి ఇద్దరు అధ్యక్షులు ఉన్నట్లే పరిస్థితి ఉండటంతో, హైకమాండ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.
ఇప్పటికే గుడివాడపై అధిష్టానానికి పిర్యాదులు అందాయని అంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *