ఆసియా కప్ కి టీమ్ సెలక్షన్ బాలేదబ్బా

ఆసియా కప్ 2025 కోసం టీమిండియా స్క్వాడ్ ప్రకటించబడింది. 15 మంది ఆటగాళ్ల జాబితాను బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ప్రకటించారు. వైస్ కెప్టెన్‌గా శుభ్‌మన్ గిల్ బాధ్యతలు చేపట్టనున్నారు. జట్టులో జస్‌ప్రీత్ బుమ్రా రీఎంట్రీ ఇచ్చాడు. అయితే యశస్వి జైస్వాల్, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్, రిషభ్ పంత్‌లకు చోటు దక్కకపోవడం పెద్ద చర్చనీయాంశమైంది. వికెట్ కీపర్లుగా సంజు శాంసన్, జితేష్ శర్మ ఉంటారు. పేస్ ఆల్‌రౌండర్లుగా హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే ఎంపిక కాగా, స్పిన్ విభాగంలో కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి కొనసాగారు. హర్షిత్ రాణా కొత్త పేసర్‌గా అవకాశాన్ని అందుకున్నాడు. జైస్వాల్, శ్రేయాస్‌లను పక్కన పెట్టడంపై మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. వారి ఫామ్, అనుభవం దృష్ట్యా ఈ నిర్ణయం సరైనది కాదని అన్నారు. ఈ సారి భారత జట్టులో సూర్యకుమార్ యాదవ్, శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, జితేష్ శర్మ, జస్‌ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్, సంజు శాంసన్, హర్షిత్ రాణా, రింకూ సింగ్ ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *