వామ్మో.. 13 బంతులు, 11 సిక్సర్లా..!!

ఆరు బంతులు, ఆరు సిక్సర్లు.. యువరాజ్ ని చూశాం. 6 బంతులు, ఒక నో బాల్.. మొత్తం 7 సిక్సర్లు రుతురాజ్ గైక్వాడ్ ని చూశాం.. వీడెవడండీ బాబూ.. 13 బంతులు, 11 సిక్సర్లు.
కేరళ క్రికెట్ లీగ్‌లోని కాలికట్ గ్లోబ్ స్టార్స్ ఆటగాడు సల్మాన్ నిస్సార్ దుమ్ము లేపాడు. తిరువనంతపురంలో శనివారం త్రివేండ్రం రాయల్స్‌ తో జరిగిన మ్యాచ్‌లో చివరి 13 బంతుల్లో 11 సిక్సులు కొట్టి టీమ్ ని గెలిపించాడు. ముఖ్యంగా 20వ ఓవర్‌లో ఆరు సిక్సులు, వైడ్-నోబాల్‌తో అదనపు పాయింట్లు రాబట్టడంతో ఆ ఓవర్‌లోనే 40 పరుగులు. బాసిల్ థంపి ఫాస్ట్ బౌలింగ్ ని చీల్చి అస్సాం చేసేశాడు. మొత్తం ఇన్నింగ్స్‌లో 26 బంతుల్లో 86 పరుగులు చేసి, చివరి 12 బంతుల్లో 71 పరుగులతో విధ్వంసం చూపించాడు. ఈ అద్భుతమైన బ్యాటింగ్ కారణంగా కాలికట్ గ్లోబ్ స్టార్స్ 186 పరుగులు చేసింది. సోషల్ మీడియాలో సల్మాన్ నిస్సార్ బ్యాటింగ్ వైరల్ అవుతోంది. ఈ బ్యాటింగ్ తో IPL వేలంలో సల్మాన్ కోసం పోటీ పడతారని క్రికెట్ పండితులు అంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *