భారత ప్రధాని నరేంద్ర మోడీ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో చేసిన సంభాషణ, ఉక్రెయిన్-రష్యా యుద్ధంపై శాంతియుత పరిష్కారానికి మద్దతు ఉంటుందని మోడీ మళ్ళీ రిపీటద చేశారు.. జెలెన్‌స్కీ కూడా రష్యా అగ్రనాయకత్వానికి సరైన సందేశం భారత్ తరపున పంపాలని తెలిపాడు.. SCO సమ్మిట్ లో మోదీ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో సమావేశం కానున్నారు, అందువల్ల జెలెన్‌స్కీతో చర్చలు మరింత ప్రాముఖ్యత పొందాయి.
అయితే, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో మోదీ సంబంధాలు ఇటీవల దెబ్బతిన్నాయని తెలుస్తోంది. ట్రంప్ ఏకపక్ష విధానాలతో భారత్-పాకిస్తాన్ శాంతి ప్రయత్నాలను సోషల్ మీడియాలో అబద్దపు కామెంట్స్ చేయడం, ట్రేడ్ డీల్ విషయంలో బెదిరింపులు చేయడం, కాశ్మీర్ వంటి వివాదాల్లో జోక్యం చేసుకోవడం వల్ల మోడీ ట్రంప్ ఫోన్ కి స్పందించకపోవడం జరిగింది. దీని ప్రభావంగా అమెరికా-భారత సంబంధాల్లో సమస్యలు ఏర్పడ్డాయి, క్వాడ్ సమ్మిట్ లో ట్రంప్ హాజరు అయ్యే అవకాశాలు కూడా తగ్గాయని అంటున్నారు.
ఏమైనా, జెలెన్‌స్కీతో సంభాషణ.. భారత్ అంతర్జాతీయ వేదికపై శాంతికోసం యాక్టివ్ రోల్ పోషిస్తోందని, తెలుస్తోంది.

