తాజాగా మెట్రో నగరాల్లో కొత్త రకమైన డేటింగ్ మోసం బయటపడింది. కొంతమంది రెస్టారెంట్ యాజమానులు, మేనేజర్లు, కాలేజీ అమ్మాయిలతో ఒప్పందాలు కుదుర్చుకొని, టిండర్ వంటి డేటింగ్ యాప్‌ల ద్వారా మగవాళ్లను ఆకర్షించి, తమ రెస్టారెంట్లలో పెద్ద ఖర్చులు చేయించుకునే పద్ధతిని ప్రయోగిస్తున్నారు. ఈ ప్రక్రియలో అమ్మాయిలు పార్ట్ టైం గర్ల్ ఫ్రెండ్ లా ఉండి, డేట్ సమయంలో ఆర్డర్ చేసుకునే స్పెషల్ ఫుడ్, డ్రింక్స్ ఖర్చు 10,000 నుండి 50,000 వరకు ఖర్చు చేస్తున్నారు. ఆ తర్వాత బిల్లును అబ్బాయి చెల్లిస్తే, అమ్మాయి అక్కడి నుండి మాయమవుతుంది, రెస్టారెంట్ యాజమాన్యం ఇచ్చిన డబ్బులో కొంత డబ్బు అమ్మాయికి ఇస్తుంది. కొన్ని సందర్భాల్లో అమ్మాయిల్ని కూడా డబ్బులు ఇవ్వకుండా రెస్టారెంట్ యాజమాన్యం మోసం చేస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై పోలీసులకు ఫిర్యాదు అందడంతో ఈ మోసం వెలుగులోకి వచ్చింది. ముంబైలో 50 రెస్టారెంట్లకు సంబంధించి కేసులు నమోదయ్యాయి, అలాగే ఇటీవల హైదరాబాద్‌లో కూడా ఒక కేసు నమోదైంది. అయితే, డేటింగ్ ద్వారా మోసపోయిన ఎక్కువ మంది అబ్బాయిలు పరువు పోతుందని ఈ విషయాన్ని బయటపెట్టడం లేదు.

