మెగా కుటుంబంలో మధ్య సోదరుడు, మెగా బ్రదర్‌గా పేరుగాంచిన నాగబాబు ఈ మధ్యకాలంలో పూర్తిగా సైలెంట్ మోడ్‌లోకి వెళ్లిపోయారని సోషల్ మీడియాలో చర్చ సాగుతోంది.
ట్విట్టర్ లో కూడా ఆయన పెద్దగా యాక్టివ్‌గా లేరని అభిమానులు అంటున్నారు. ఇటీవలే ఆయన మొదటిసారి ఎమ్మెల్సీ హోదాలో అసెంబ్లీ వర్షాకాల సమావేశాలకు హాజరయ్యారు. కొన్ని చర్చల్లో పాల్గొన్నా, ఆ తరువాత నుంచి ఆయన వైపు నుంచి ఎలాంటి స్పందన లేకపోవడం ఆసక్తిగా మారింది. హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలపై నాగబాబు అంతర్గతంగా అసంతృప్తిగా ఉన్నారని సమాచారం. సాధారణంగా తన సోదరులపై ఎవరైనా కామెంట్ చేస్తే వెంటనే స్పందించే నాగబాబు ఈసారి మాత్రం మౌనం వహించడం ఆశ్చర్యంగా మారింది.
పార్టీ పాలనలో ఎమ్మెల్సీగా ఉన్న నాగబాబు ఏమి మాట్లాడినా అది రాజకీయంగా నెగిటివ్ గా మారే అవకాశం ఉండటంతో, ఆయన జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారని అంటున్నారు. తన సోదరుల సూచనతోనే ఈసారి రియాక్ట్ కాలేదని సమాచారం.
ఇక సోషల్ మీడియాలో మాత్రం బాలయ్య ఫ్యాన్స్ vs మెగా ఫ్యాన్స్ వార్ మాత్రం ఆగడం లేదు. పవన్ కళ్యాణ్ తన పనుల్లో బిజీగా ఉండగా, నాగబాబు కొంత కాలం తర్వాత మళ్లీ యాక్టివ్ అవుతారని మెగా అభిమానులు ఆశిస్తున్నారు.

