మా నాన్న కాంగ్రెస్ మనిషి: విజయారెడ్డి

హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ జెండా ఎగరనివ్వనని పీజేఆర్ కుమారుడు, మాజీ ఎమ్మెల్యే పి.విష్ణువర్ధన్‌రెడ్డి చేసిన కామెంట్స్ పై ఆయన సోదరి విజయారెడ్డి స్పందించారు. ఒక ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ, మా నాన్న పీజేఆర్ జీవితాంతం కాంగ్రెస్ మనిషి. ఆయనకు నిజమైన నివాళి అంటే కాంగ్రెస్ గెలిపించడమేనని అన్నారు. కాంగ్రెస్ పార్టీ గెలిస్తే పీజేఆర్ ఆత్మ సంతోషిస్తుందని కూడా ఆమె చెప్పారు.
విజయారెడ్డి మాట్లాడుతూ, ఎవరి రాజకీయం వాళ్లదే కానీ, మా నాన్నకు నచ్చిన జెండా మాత్రం కాంగ్రెస్‌ జెండా అని స్పష్టం చేశారు.
ఇక విష్ణువర్ధన్‌రెడ్డి మాత్రం బీఆర్ఎస్ సమావేశంలో మాట్లాడుతూ, టికెట్ కోసం కూడా డబ్బులు అడిగిన పార్టీ కాంగ్రెస్ అని, నేను కష్టాల్లో ఉన్నపుడు బీఆర్ఎస్ అండగా నిలిచిందని, మాగంటి సునీత గెలవడం ఖాయమని అన్నారు.
జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో బీఆర్ఎస్ తరఫున మాగంటి సునీత, కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్ బరిలో ఉన్నారు. బీజేపీ అభ్యర్థి ఇంకా ఖరారు కాలేదు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *