ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల రెండో రోజు ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి. శాసనసభకు వైసీపీ ఎమ్మెల్యేలు హాజరు కాకపోవడంతో సభలో అధికార కూటమి సభ్యులే కనిపించారు. ప్రశ్నలు కూడా వారివే… సమాధానాలు కూడా వారివే అన్నట్టుగా వాతావరణం సాగింది. అయితే శాసన మండలిలో మాత్రం భిన్నంగా కనిపించింది. వైసీపీ సభ్యులు పెద్ద ఎత్తున స్పందిస్తూ ప్రభుత్వాన్ని నిలదీశారు. దీంతో మంత్రులు కూడా మండలిపైనే ఎక్కువ దృష్టి పెట్టారు.
ఈ క్రమంలో మంత్రి నారా లోకేష్ వ్యవహరించిన తీరు ఇప్పుడు చర్చగా మారింది. వైసీపీ సభ్యుల ప్రశ్నలకు సమాధానం ఇస్తూ ఆయన ఒక్కసారి కూడా ప్రతిపక్ష సభ్యుల వైపు చూడలేదు. పూర్తిగా మండలి చైర్మన్ వైపు చూస్తూ సమాధానాలు ఇచ్చారు. సాధారణంగా ప్రతిపక్షం వైపు చూస్తూ సమాధానం చెప్పే సంప్రదాయం ఉండగా, లోకేష్ మాత్రం ఆ ట్రెండ్ మార్చినట్టుగా కనిపించారు.
వైసీపీ సభ్యులు కళ్యాణి, మాధవరావు లాంటి నేతలు ఆశ్చర్యం వ్యక్తం చేసినట్టు సమాచారం.

