భారత్ ఓటమి: డి క్లెర్క్ సూపర్ షాట్

గురువారం జరిగిన ఉత్కంఠభరిత మ్యాచ్‌లో సౌతాఫ్రికా, నాడిన్ డి క్లెర్క్ అద్భుత ఇన్నింగ్స్‌తో భారత్‌ను 3 వికెట్ల తేడాతో ఓడించింది. క్లెర్క్ 54 బాల్స్ లో 8 ఫోర్లు, 5 సిక్సర్లతో 84 రన్స్ తో సౌతాఫ్రికాకి గెలుపును అందించింది. భారత్ 49.5 ఓవర్లలో 251 పరుగులకు ఆలౌటైంది. రిచా ఘోష్ 94, ప్రతీక రావల్ 37, స్నేహ్ రాణా 33 పరుగులు చేసి జట్టును రక్షించారు, కానీ మిగిలిన ఆటగాళ్లు పెద్దగా రాణించకపోవడంతో భారీ స్కోర్ చేయలేకపోయింది..
సౌతాఫ్రికా వికెట్లు పడిపోతున్నా.. కెప్టెన్ లారా 70 పరుగులు, ట్రయన్ 49 పరుగులతో మంచి భాగస్వామ్యం రాబట్టారు. చివరి ఓవర్లలో డి క్లెర్క్ అద్భుత ఆటతో మ్యాచ్ ఫినిష్ చేసింది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు క్లెర్క్ ని వరించింది.
ఈ మ్యాచ్‌లో మంధాన మళ్లీ విఫలమైనా, ఒక క్యాలెండర్ ఇయర్‌లో అత్యధికంగా 982 రన్స్ సాధించిన భారత క్రికెటర్‌గా రికార్డు సృష్టించింది. రిచా ఘోష్ 94 రన్స్ తో, 8వ వికెట్‌లో అత్యధిక రన్స్ సాధించిన ప్లేయర్ గా కొత్త రికార్డు నమోదు చేసింది. భారత్ ఇంకొంచెం స్కోర్ చేసి ఉంటే సౌతాఫ్రికా గెలవడం కష్టమయ్యేది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *