బీరు అమ్మకాల్లో తెలంగాణా టాప్

తెలంగాణలో మద్యం, పొగాకు వినియోగం ఆందోళనకరంగా పెరుగుతోందని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఫైనాన్స్ అండ్ పాలసీ (NIPFP) తాజా నివేదిక వెల్లడించింది. 2022-23 ఆర్థిక సంవత్సర గణాంకాల ప్రకారం, బీరు వినియోగంలో తెలంగాణ దేశంలోనే మొదటి స్థానంలో ఉంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఒక వ్యక్తి సగటున బీరు, విదేశీ మద్యం కోసం రూ.3,061 ఖర్చు చేస్తున్నారు. ఇది దేశ సగటు రూ.486 కంటే దాదాపు ఆరు రెట్లు ఎక్కువ. 2014-15లో రూ.745గా ఉన్న మద్యం ఖర్చు, 2022-23 నాటికి రూ.1,623కి పెరగడం ఈ అలవాటు వేగంగా పెరుగుతోందని సూచిస్తోంది. ధూమపానంలో కూడా రాష్ట్రం ఐదవ స్థానంలో ఉంది. పట్టణాల్లో ధనవంతులు బీరు, సిగరెట్లు ఎక్కువగా వాడుతుండగా, గ్రామీణ ప్రాంతాల్లో తక్కువ, మధ్యతరగతి ప్రజలు పొగాకు, బీడీలు, నిపుణుల ప్రకారం, అధిక మద్యం, పొగాకు వినియోగం అనేక రోగాల బారిన పడతారని, కుటుంబ ఆర్థిక భారం పెరగడంతో పాటు, కలహాలు, నేరాలు, రోడ్డు ప్రమాదాలు కూడా పెరిగే ప్రమాదం ఉంది. ఈ పరిస్థితిని అదుపు చేసేందుకు ప్రభుత్వం విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలు చేపట్టాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *