చాలా రోజుల తర్వాత బీజేపీ మాజీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఉగ్రరూపం చూపించారు. ఆయన తన ఫైర్‌ను మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్, ఏపీసీసీ ప్రెసిడెంట్ వైఎస్ షర్మిలపై చూపించారు.
ఆర్ఎస్ఎస్‌ను ఎప్పటిలాగే విమర్శించిన ఉండవల్లి, ఇండియా కూటమి ఉప రాష్ట్రపతి అభ్యర్థి సుదర్శన్ రెడ్డికి ఓటేయాలని కోరారు. ఎన్డీయే అభ్యర్థి ఆర్ఎస్ఎస్ భావజాలానికి చెందినవారని అన్నారు. దీనిపై వీర్రాజు ఆగ్రహం వ్యక్తం చేస్తూ, రాజమండ్రిలో బహిరంగ చర్చకు సవాల్ విసిరారు.
అదే విధంగా షర్మిల కూడా జగన్‌ను, ఆర్ఎస్ఎస్‌ను విమర్శించడంపై వీర్రాజు మండిపడ్డారు. షర్మిల రాజకీయాలు అన్నయ్యపై వ్యక్తిగత కోపంతో నడుస్తున్నాయన్న సెటైర్లు వేశారు.
జగన్ ఓటు వేసినందుకు ఇండియా కూటమి విమర్శలు చేసినా, బీజేపీ తరఫున జగన్‌కు ఇన్‌డైరెక్ట్‌గా సపోర్ట్ చేసిన ఏకైక నేతగా సోము వీర్రాజు కనిపించారు.
మొత్తంగా, ఏపీ రాజకీయాల్లో వీర్రాజు మళ్లీ ఫైర్ బ్రాండ్‌గా వెలుగులోకి వచ్చారు.

