ఇది T20 కాదు.. T10 లా ఉంది.

డిఫెండింగ్‌ ఛాంపియన్‌గా బరిలోకి దిగిన భారత్‌… ఆసియా కప్‌లో అద్భుత ఆరంభం చేసింది. గ్రూప్‌-ఎ మ్యాచ్‌లో UAEపై.. 9 వికెట్ల తేడాతో ఈజీగా గెలిచింది.
మొదట బ్యాటింగ్‌ చేసిన UAE కేవలం 57 పరుగులకే ఆలౌటయింది. కుల్దీప్‌ యాదవ్‌ 4 వికెట్లకు 7 పరుగులు, శివం దూబే 3 వికెట్లకు 4 పరుగులు ఇవ్వడంతో UAE బ్యాటర్స్ పేకమేడలా కూలిపోయారు. అలీషాన్‌ షరాఫ్ 22 పరుగులు, మహ్మద్‌ వసీం 19 పరుగులు చేసి పర్వాలేదనిపించారు.
తర్వాత బ్యాటింగ్ చేసిన భారత్‌ 4.3 ఓవర్లలోనే గెలిచేసింది. అభిషేక్‌ శర్మ 30, శుభ్‌మన్‌ గిల్‌ 20 పరుగులతో మెరిపించారు. కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ సిక్స్‌తో మ్యాచ్‌ను ముగించాడు.
మొత్తం 106 బంతుల్లోనే మ్యాచ్‌ మొత్తం పూర్తి కావడం విశేషం. కుల్దీప్‌కు ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు దక్కింది.
భారత్‌ బలమైన ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో టోర్నీలో విజయంతో బోణీ కొట్టింది..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *