పొసాని సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్

సినీ రచయిత, నటుడు పొసాని కృష్ణమురళి మళ్లీ సినిమాల్లోకి రీ-ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అయ్యారు. రాజకీయాల్లోకి అడుగుపెట్టి వివాదాలు, జైలు జీవితం చూసిన ఆయన, కొంతకాలం నిశ్శబ్దంగా గడిపారు. ఇప్పుడు మాత్రం పూర్తిగా సినిమాలపై దృష్టి పెట్టాలని నిర్ణయించుకున్నారు.
ఈ నెల 22న నవరాత్రుల సందర్భంగా ఆపరేషన్ అరుణారెడ్డి పేరుతో కొత్త సినిమాకు శ్రీకారం చుట్టబోతున్నారు. జర్నలిస్టు బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ కథను ఆయన స్వయంగా రాసి, దర్శకత్వం వహించబోతున్నారు. అంతేకాదు సినిమాలో ఒక కీలక పాత్రలో కూడా కనిపించనున్నారు.
ఈసారి పొసాని రాజకీయాలకు సంబంధించిన ఎలాంటి విషయాలు టచ్ చేయకూడదని అనుకున్నట్లు తెలుస్తుంది. రాజకీయాల్లో ఆయన మాట్లాడిన బూతులు జనాల్లో చాలా నెగిటివ్ అయ్యాయి.
ఇక ఆయన సెకండ్ ఇన్నింగ్స్ సినీ కెరీర్‌లో కొత్త విజయాలు అందిస్తుందా లేదా అన్నది చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *