అమెరికాలో సంచలన ఘటన చోటుచేసుకుంది. కన్సర్వేటివ్ సంస్థ టర్నింగ్ పాయింట్ USA సహ వ్యవస్థాపకుడు, సీఈఓ చార్లీ కిర్క్.. ఉటాహ్ వాలీ యూనివర్సిటీలో జరిగిన కార్యక్రమంలో ప్రసంగిస్తుండగా కాల్పులు జరిగాయి. ఈ దాడిలో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. ఆసుపత్రికి తరలించారు. ఆయనకు సీరియస్ గా ఉందని మాత్రమే తెలిపారు. అధికారికంగా ఆయన మరణం ధృవీకరించబడలేదని అమెరికా మీడియా స్పష్టం చేస్తోంది. అయితే ఈ సంఘటనతో అమెరికా రాజకీయ వర్గాల్లో కలకలం రేగింది. యువతలో దేశభక్తి, కన్సర్వేటివ్ ఆలోచనలను రగిలించడంలో చార్లీ కిర్క్ ప్రముఖ పాత్ర పోషించారు. ఈ ఘటనపై రిపబ్లికన్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ హింసను ఖండించారు. పోలీసులు దాడి వెనుక ఉద్దేశ్యాన్ని విచారిస్తున్నారు. ట్రంప్ సహా పలువురు నేతలు చార్లీ కిర్క్ కుటుంబానికి మద్దతుగా నిలుస్తామని ప్రకటించారు. అమెరికా రాజకీయాల్లో భద్రతా లోపాలపై మళ్లీ చర్చ మొదలైంది.

