ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పర్యటనపై సీఎం చంద్రబాబు ప్రత్యేక శ్రద్ధ చూపించారు. కర్నూలు పర్యటన విజయవంతం కావాలని సీఎం స్వయంగా సమన్వయం చేశారు. ఈ పర్యటన కోసం గత నాలుగు–ఐదు రోజులుగా ఆయన పర్సనల్ గా రివ్యూ చేసి, ప్రతి అంశాన్ని స్వయంగా పర్యవేక్షించారు.
నాలుగు గంటలపాటు టీడీపీ నేతలతో టెలికాన్ఫరెన్స్ జరిపి, చంద్రబాబు, మంత్రులు, ప్రజా ప్రతినిధులందరూ తప్పనిసరిగా కర్నూలులో ఉండాలని ఆదేశించారు. ప్రధాని పర్యటనను ప్రతిష్టాత్మకంగా చేయాలని పిలుపునిచ్చారు.
ఒకరకంగా చెప్పాలంటే, ఈసారి సీఎం చంద్రబాబు ప్రధానమంత్రికి బీజేపీ నేతలకన్నా ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారనే మాట టీడీపీ వర్గాల్లో వినిపిస్తోంది. గతంలో కూడా మోడీ ఆంధ్రా పర్యటనలకు చంద్రబాబు ప్రాధాన్యమిచ్చినా, ఈసారి మాత్రం ఆయన దృష్టి మరింత స్పష్టంగా కనబడుతోంది.
రాష్ట్ర ప్రయోజనాల కోసమా, లేక రాజకీయ వ్యూహమా అనే చర్చ కొనసాగుతున్నా.. పీఎం కోసం సీఎం మనసు పెడుతున్నారనే కామెంట్స్ టీడీపీ లోపల పెద్ద చర్చగా మారింది. ప్రధాని పర్యటన గ్రాండ్ సక్సెస్ అవడంతో మోడీ స్వయంగా చంద్రబాబును ప్రశంసించారు.

