తోక ముడిచిన ట్రంప్, ఏమైందో?

ఉక్రెయిన్ యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ త్వరలో శిఖరాగ్ర సమావేశం జరపనున్నారు. ఈ చర్చలపై ఇప్పటికే అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రష్యాకు అనుకూలంగా పరిస్థితులు మారుతున్నాయన్న అభిప్రాయం విశ్లేషకులది. ట్రంప్ రాయబారి స్టీవ్ విట్‌కాఫ్ ప్రతిపాదించినట్లుగా, ఉక్రెయిన్ కాల్పుల విరమణకు బదులుగా డొనెట్స్క్, లుహాన్స్క్ ప్రాంతాలను వదులుకోవాలన్న ఆలోచనపై కైవ్‌ తో పాటు యూరోపియన్ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. పోరాటం లేకుండానే రష్యా భూభాగాన్ని ఆక్రమించుకునే ప్రయత్నం జరుగుతుందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అలాగే విట్‌కాఫ్ వ్యవహారశైలి, ఉక్రెయిన్ సార్వభౌమాధికారంపై సడలింపు చూపడం, పట్టణాలను వదిలి సైనికులను కాపాడాలని సూచించడం వంటి అంశాలు రష్యాకు మేలు చేసే దిశగా ఉన్నాయనే వాదనలకు బలం చేకూర్చాయి. ఈ క్లిష్ట పరిస్థితుల్లో ట్రంప్–పుతిన్ చర్చలు ఉక్రెయిన్ భవిష్యత్తుపై ఎలా ప్రభావం చూపుతాయో అని ప్రపంచ దేశాలు ఉత్కంఠగా గమనిస్తున్నాయి.
ఈ సమావేశం ఫలితాలు యుద్ధానికి శాంతి దారితీస్తాయా లేదా ఉక్రెయిన్ మరింత బలహీనపడుతుందా అన్నది స్పష్టత కావాలి. ప్రపంచ శాంతి సమీకరణాలపై కూడా ఈ చర్చలు కీలక మలుపు కానున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *