ట్రంప్ టారిఫ్‌లు – అమెరికా కొలాప్స్


డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం అమలు చేసిన టారిఫ్‌లు అమెరికా ఆర్థిక వ్యవస్థకు, అంతర్జాతీయ ప్రతిష్టకు లాంగ్ టైమ్‌లో వ్యతిరేక ప్రభావం చూపే అవకాశముంది. అమెరికా ఫస్ట్ అనే నినాదంతో తీసుకున్న ఈ నిర్ణయాలు మొదట్లో దేశీయ పరిశ్రమలకు రక్షణ కల్పించినా, వినియోగదారులపై భారం పెంచి, ఎగుమతులను తగ్గించాయి. చైనా, యూరప్, భారత్ వంటి దేశాలు ప్రతీకార టారిఫ్ లు విధించడంతో అమెరికా వ్యవసాయం, స్టీల్ రంగాలు నష్టపోయాయి. టారిఫ్‌ల వల్ల అమెరికా సాఫ్ట్ పవర్ దెబ్బతింది, మిత్రదేశాలు దూరమయ్యాయి. భారత్‌తో కూడా వాణిజ్య వివాదాలు పెరగడంతో, భారత్‌ చైనా వంటి దేశాలతో ఆర్థిక సహకారం కోసం చూడాల్సి వచ్చింది. ఈ పరిణామాలు ఆసియాలో చైనా బలాన్ని పెంచాయి. మొత్తానికి, ట్రంప్ టారిఫ్‌లు టెంపరరీ రక్షణ కల్పించినా, ప్రపంచ వాణిజ్యానికి అయోమయ పరిస్థితి తెచ్చిన అమెరికా తమ ప్రభావాన్ని తగ్గించినట్లు నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *