నకిలీ మద్యం కేసులో మాజీ మంత్రి జోగి రమేష్‌పై ఆరోపణలు మరింత తీవ్రంగా మారుతున్నాయి. ప్రధాన నిందితుడు అద్దేపల్లి జనార్దన్ రావు.. అన్నీ జోగి చెప్పిందే చేశానని వీడియోలో వెల్లడించి సంచలనం రేపాడు. మొదట జనార్దన్ ఎవరో తనకు తెలియదని చెప్పిన జోగి, తర్వాత మా తాత, వాళ్ల తాత ఒకే వీధిలో ఉండేవారంటూ మాట మార్చారు.
ఇంతలో ఇద్దరి మధ్య జరిగిన వాట్సాప్ చాట్ బయటకు రావడంతో వివాదం మరింత పెరిగింది. అందులో జోగి రమేష్ స్వయంగా ఇంటికి రా… ఫేస్‌టైమ్‌లో మాట్లాడుదాం.. ఆఫ్రికా ఎప్పుడు వెళ్తావు? లాంటి మెసేజెస్ పంపినట్టు ఉన్న చాటింగ్ బయటికొచ్చింది. ఈ ఆధారాలు వెలుగులోకి రావడంతో జోగి రమేష్ బుకాయింపు మాటలు మరింత గందరగోళం సృష్టిస్తున్నాయి.
తనపై కేసులు పెట్టి ఇరికించాలనుకుంటున్నారని జోగి రమేష్ అంటున్నారు. “నేను చంద్రబాబుకు, లోకేష్ కు భయపడను, దేనికైనా సిద్ధమని సవాల్ చేశాడు. ఆధారాలు ఒక్కొక్కటి బయటకు వస్తుండటంతో ఆయనపై ఒత్తిడి పెరుగుతోంది.

