జగన్ ని ఆహ్వానించిన పవన్ కల్యాణ్

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ సమావేశాలపై మళ్లీ రాజకీయ చర్చ మొదలైంది. స్పీకర్ అయ్యన్నపాత్రుడు, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు, సీఎం చంద్రబాబు పలుమార్లు జగన్‌ను సభకు రావాలని కోరారు. రాజంపేటలో పెన్షన్ పంపిణీ సభలోనూ, తాజాగా సూపర్ సిక్స్
సభలోనూ సీఎం సవాల్ విసిరారు. పవన్ కళ్యాణ్ కూడా జగన్ రాజ్యాంగాన్ని గౌరవించి సభకు హాజరుకావాలన్నారు.
ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తామని, వైసీపి స్పష్టంగా చెబుతోంది.. ఒక్కో ఎమ్మెల్యేకు ఐదు నిమిషాల టైమ్ మాత్రమే దొరకడం వల్ల ప్రజా సమస్యలు చెప్పలేమని జగన్ వ్యాఖ్యానించారు.
ఇక కూటమి పిలుపుల వెనక వ్యూహం ఉందని విశ్లేషకులు అంటున్నారు. వైసీపీ సభకు దూరంగా ఉంటే ప్రజా తీర్పును తేలికగా తీసుకున్నట్టవుతుందని అంటున్నారు.
వైసీపీకి అసెంబ్లీ బహిష్కారం లాభమా, నష్టమా అన్నది కాలమే చెప్పాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *