బాలీవుడ్ నటి, హిమాచల్ ప్రదేశ్ నుంచి ఎంపీగా గెలిచిన కంగనా రనౌత్ మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. 2021లో సాగు చట్టాలకు వ్యతిరేకంగా జరిగిన రైతుల ఉద్యమంలో పాల్గొన్న 73 ఏళ్ల మహిళా రైతు మహీందర్ కౌర్‌ను కంగనా తీవ్రంగా విమర్శించారు. ఆమెను షాహీన్ బాగ్ నిరసనలో నిలబడ్డ బిల్కిస్ బానోతో పోల్చుతూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో మహీందర్ కౌర్ పరువు నష్టం కేసు వేశారు.
ఈ కేసులో కంగనా దాఖలు చేసిన పిటిషన్‌ను శుక్రవారం సుప్రీం కోర్టు విచారించింది. మీరు కేవలం రీట్వీట్ చేయలేదు.. దానికి మసాలా జోడించారు.. అంటూ ధర్మాసనం కామెంట్ చేసింది.. హైకోర్టు ఇచ్చిన తీర్పునే కొనసాగిస్తూ కంగనా పిటిషన్‌ను కొట్టివేసింది. దీంతో ఆమెపై పరువు నష్టం కేసు కొనసాగనుంది.
నటిగా ఉన్నప్పటికీ కంగనా తరచూ కాంట్రవర్సీ కామెంట్స్ తో వార్తల్లో నిలిచారు. ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కూడా విమర్శలతోనే ఎక్కువగా హైలైట్ అవుతున్నారు.

