గణేష్ విగ్రహం మీద కోడిగుడ్ల దాడి

వడోదరలో గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా దారుణ ఘటన చోటు చేసుకుంది. ఊరేగింపుపై కొందరు యువకులు గణపతి విగ్రహంపై గుడ్లు విసిరారు. ఇది మత సామరస్యాన్ని దెబ్బతీసే ఉద్దేశమేనని పోలీసులు చెప్పారు. వడోదర పోలీసులు వెంటనే చర్యలు తీసుకొని నలుగురు యువకులను అరెస్టు చేశారు. వారిలో ఒకరు మైనర్ అని తెలిపారు. సాధారణంగా జైలు శిక్ష విధిస్తారు, కానీ ఈసారి ప్రజలకు స్పష్టమైన సందేశం ఇవ్వడానికి వినూత్న పద్ధతిలో శిక్షించారు. నిందితులను సంఘటన జరిగిన ప్రదేశానికి తీసుకువచ్చి, ప్రజల ముందు మోకాళ్లపై కూర్చోబెట్టి క్షమాపణ చెప్పించారు. భవిష్యత్తులో ఇలాంటి చర్యలు జరగకుండా వార్నింగ్ ఇచ్చారు. ఈ సంఘటన పానీగేట్ ప్రాంతంలో, హిందూ-ముస్లిం సెన్సిటివ్ ఏరియాలో జరిగింది. పోలీసులు మరియు క్రైమ్ బ్రాంచ్ అధికారులు పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. డీసీపీ హిమాన్షు వర్మ వివరాల ప్రకారం, ఇది కేవలం శిక్ష మాత్రమే కాక, సమాజంలో మత సామరస్యాన్ని కాపాడటానికి ఒక ప్రయత్నమని, మత సామరస్యాన్ని దెబ్బతీసే ఏ పరిస్థితిని సహించమని స్పష్టంగా చెప్పారు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *