గణేష్ లడ్డూని దక్కించుకున్న ముస్లిం మహిళ

నిర్మల్ జిల్లా ఆదర్శ నగర్‌లో గణేష్ నిమజ్జనం సందర్భంగా లడ్డూ వేలం స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. ఈ వేలంలో ముస్లిం మహిళ అమ్రీన్ 1,88,888కి లడ్డూను దక్కించుకున్నారు. ఆమె నిర్ణయాన్ని స్థానికులు హర్షించారు. ఈ సంఘటన సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది
ఇదే విధంగా కుంటాల మండలం అంబకంటిలో 7వ తరగతి విద్యార్థి రెహమాన్ 1111 చెల్లించి లడ్డూను పొందాడు.
మతసామరస్యం మహారాష్ట్రలోనూ కనిపించింది. సాంగ్లీ జిల్లా గోట్ఖిండీ గ్రామంలోని మసీదులో ముస్లింలే గణేష్ ఉత్సవాలు జరుపుతూ, నవరాత్రులు ముగిసిన తర్వాత విగ్రహ నిమజ్జనం చేస్తున్నారు. ఈ సంప్రదాయం 1980 నుంచి కొనసాగుతోంది.
హిందూ–ముస్లింల కలయికతో జరిగే ఈ వేడుకలు దేశంలో జాతీయ సమైక్యతకు నిదర్శనంగా నిలుస్తున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *