ఆంధ్రప్రదేశ్‌లో రెండు పార్టీల రాజకీయ వ్యవస్థ మళ్లీ చర్చనీయాంశంగా మారింది. ఒకసారి టీడీపీ, మరోసారి వైసీపీ అధికారంలోకి వస్తున్నా – ఈసారి మాత్రం పరిస్థితి వేరుగా ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
2024లో టీడీపీ కూటమి ఘన విజయం సాధించింది. ఈసారి చంద్రబాబు అనుభవం, కూటమి సమన్వయం, అభివృద్ధి–సంక్షేమం మధ్య సమతుల్యత ప్రజల మద్దతు కూటమికి బలాన్నిచ్చాయి. అటు పార్టీ వ్యవస్థను బలంగా ఉంచి, ఇటు పాలనలో వేగం చూపిస్తున్నారు.
వైసీపీ మాత్రం ఓటమి తర్వాత దిశా నిర్దేశం లేక ఇబ్బందుల్లో ఉంది. జగన్ ప్రజల్లోకి పెద్దగా వెళ్లడం లేదు. విపక్షంగా ఒంటరిగా ఉండటం వల్ల పార్టీ బలహీనంగా మారిందని అంటున్నారు.
చంద్రబాబు మాత్రం ఒకే పార్టీ పదికాలాలు అధికారంలో ఉంటేనే అభివృద్ధి కొనసాగుతుందని ప్రజలతో చెబుతున్నారు. కూటమి ఓటు బ్యాంక్ బలంగా ఉంది. 2029 ఎన్నికలపైనా చంద్రబాబుకు నమ్మకం కనిపిస్తోంది.
ఇక వైసీపీ దీనిని ఎలా తిప్పికొడుతుంది? కొత్త వ్యూహం చూపుతుందా? అనే ప్రశ్నలు ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో ప్రధాన చర్చగా మారాయి.

