ఏపీ అసెంబ్లీలో ఏఐ ఫేషియల్ అటెండెన్స్

ఆంధ్రప్రదేశ్ శాసనసభ సరికొత్త సాంకేతికతతో మరో ముందడుగు వేసింది. ఎమ్మెల్యేల హాజరు నమోదు కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత Facial recognition విధానాన్ని ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఇకపై సభ్యులు తమకు కేటాయించిన సీటులో కూర్చుంటేనే హాజరు ఆటోమేటిక్‌గా నమోదు కానుంది. సభలో ఎంతసేపు ఉన్నారు? మధ్యలో వెళ్లిపోయారా? అన్నది కూడా సిస్టమ్ స్పష్టంగా నమోదు చేస్తుంది.
175 మంది ఎమ్మెల్యేల ఫొటోలను Vectorization చేసి సాఫ్ట్‌వేర్‌లో నమోదు చేశారు. సభలో ఏర్పాటు చేసిన పీటీజెడ్ కెమెరాల ద్వారా హాజరు డేటా నేరుగా డ్యాష్‌బోర్డుకు చేరుతుంది. మానవ ప్రమేయం లేకుండా పారదర్శక విధానం అమలవుతుందని అధికారులు చెబుతున్నారు.
ఉత్తరప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల తర్వాత ఈ విధానాన్ని అమలు చేస్తున్న రాష్ట్రంగా ఏపీ నిలుస్తోంది. ప్రాక్సీ అటెండెన్స్‌కు చెక్ పెట్టడంతో పాటు డిజిటల్ అసెంబ్లీ దిశగా ఇది కీలక అడుగుగా మారనుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *