SCO సమ్మిట్, మోడీకి టాప్ ప్లేస్.

SCO శిఖర సమ్మేళనంలో ఒక విశేషం చోటుచేసుకుంది. ఆపరేషన్ సిందూర్ తర్వాత తొలిసారి భారత ప్రధాని నరేంద్ర మోడీ, పాకిస్థాన్ ప్రధాని షెహ్‌బాజ్ షరీఫ్ ఒకే వేదికపై కనిపించారు. అయితే మోడీ, షరీఫ్‌కి దూరంగా ఉండగా, ఇతర దేశాధినేతలతో స్నేహపూర్వకంగా సమావేశమయ్యారు. నేపాల్ ప్రధాని ఒలితో సాంస్కృతిక సంబంధాలు, మాల్దీవుల అధ్యక్షుడు ముయిజ్జుతో అభివృద్ధి భాగస్వామ్యం, మయన్మార్ నేత మిన్ ఆంగ్ హ్లెయింగ్‌తో రక్షణ, భద్రత, కనెక్టివిటీ ప్రాజెక్టులపై చర్చించారు. అలాగే ఈజిప్ట్ ప్రధాని, బెలారస్ అధ్యక్షుడితో కూడా సమావేశమయ్యారు. “పొరుగు దేశాలు మొదట” అనే విధానంతో పాటు “Act East” విధానంపై భారత్ ఎంత ప్రాధాన్యత ఇస్తుందో మోడీ స్పష్టం చేశారు. ఈ పర్యటనలో చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ తనకు ఇష్టమైన లగ్జరీ కార్ హోంగ్‌చీ-5ని మోడీ వినియోగానికి ఇచ్చారు. దీనిని చైనాకు చెందిన రోల్స్ రాయిస్‌ అని కూడా పిలుస్తారు. ఈ సమావేశం భారత్‌కు రాజకీయ, దౌత్యపరంగా కీలకంగా మారింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *