IBPS రూరల్ బ్యాంక్ ఉద్యోగాలు

యువత కోసం గుడ్‌న్యూస్! ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్.. గ్రామీణ బ్యాంకుల్లో 13,217 ఖాళీలను భర్తీ చేయడానికి కొత్త నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ రిక్రూట్మెంట్‌లో ఆఫీసర్ స్కేల్-I, II, III మరియు ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి.
దరఖాస్తులు సెప్టెంబర్ 1, 2025 నుంచి ప్రారంభమై, సెప్టెంబర్ 21, 2025 వరకు చేయవచ్చు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు www.ibps.in…. http://www.ibps.in ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
ఖాళీలు..
ఆఫీస్ అసిస్టెంట్: 7,972
ఆఫీసర్ స్కేల్-I: 3,907
ఆఫీసర్ స్కేల్-II & III: వివిధ ప్రత్యేక విభాగాల్లో 1,338

విద్యార్హత.. గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి డిగ్రీ. ఇతర స్పెషల్ పోస్టులకు సంబంధిత అనుభవం/డిగ్రీ అవసరం.
వయో పరిమితి సెప్టెంబర్ 1, 2025 నాటికి..
ఆఫీస్ అసిస్టెంట్: 18–28 ఏళ్లు
ఆఫీసర్ స్కేల్-I: 18–30 ఏళ్లు
ఆఫీసర్ స్కేల్-II: 21–32 ఏళ్లు
ఆఫీసర్ స్కేల్-III: 21–40 ఏళ్లు
రిజిస్ట్రేషన్, ఫోటో, సంతకం అప్‌లోడ్ చేసి ఆన్‌లైన్ ఫీజు చెల్లించాలి. రిజర్వ్‌డ్ కేటగిరీకి వయో పరిమితిలో సడలింపు ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *