కాశ్మీరీ పిల్లతో కాటేరమ్మ చిన్న కొడుకు

భారత క్రికెట్ యువ ఆటగాడు, పంజాబ్ కు చెందిన ఓపెనర్ అభిషేక్ శర్మ ఈ రోజు 25వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. 2004 సెప్టెంబర్ 4న అమృత్‌సర్‌లో జన్మించిన అభిషేక్ చిన్న వయసులోనే యువరాజ్ సింగ్ మెంటార్ గా శిక్షణ పొందాడు. యువరాజ్ సింగ్ ఇచ్చిన క్రమశిక్షణ, రూల్స్ అభిషేక్ క్రికెట్ ఆటకు మంచి రిజల్ట్స్ ఇచ్చాయి.
2018లో అండర్-19 ప్రపంచకప్‌లో బెస్ట్ క్రికెటర్ గా నిలిచిన అభిషేక్, ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరపున టాప్ లెవల్ ఆటను చూపించాడు. 2024లో జింబాబ్వే పర్యటనకు ఎంపికై, ఇంటర్నేషనల్ క్రికెట్‌లో అడుగు పెట్టాడు.
అంతేకాదు, అభిషేక్ తన పర్సనల్ లైఫ్ లో కూడా వార్తల్లో నిలుస్తున్నాడు. ప్రస్తుతం అతను లైలా ఫైసల్ అనే మోడల్ అండ్ ఫ్యాషన్ ఎంటర్‌ప్రెన్యూర్ తో ఢిల్లీ వీథుల్లో జంటగా కనిపిస్తున్నాడు. లైలా లండన్ లో పెరిగి, లైలా రూహీ ఫైసల్ డిజైన్స్ అనే ఫ్యాషన్ బ్రాండ్‌ను ఇండియాలో స్టార్ట్ చేసింది.. ఈమె కాశ్మీరు ముస్లిం అమ్మాయి.
అభిషేక్ శర్మ తన కఠిన శ్రమ, టాలెంట్ తో భారత్ క్రికెట్ లో ఒక యూత్ ఐకాన్ గా, ఎదుగుతున్నాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *