ఆంధ్రప్రదేశ్‌లో బడ్జెట్ సెషన్ ప్రారంభమైన నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూటమి ఎమ్మెల్యేలు, మంత్రులకు కీలక దిశానిర్దేశం చేశారు. 17 పని దినాల పాటు సాగే ఈ సెషన్‌లో ప్రతీ ఒక్కరూ క్రమం తప్పకుండా హాజరుకావాలని స్పష్టం చేశారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు జరిగే సభా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొని, సబ్జెక్ట్‌పై పూర్తిగా ప్రిపేర్ అయి మాట్లాడాలని సూచించారు. సభలో చేసే ప్రతి ప్రసంగం రికార్డు అవుతుందని, ప్రజలు జాగ్రత్తగా గమనిస్తారని హెచ్చరించారు.
మంత్రులు మధ్యాహ్నం తర్వాత తమ ప్రాంతాల ఎమ్మెల్యేలతో సమావేశమై ప్రజా సమస్యలను తెలుసుకుని పరిష్కార మార్గాలు చూపాలని ఆదేశించారు. బడ్జెట్ అంటే నిధులు, అభివృద్ధి, ప్రాజెక్టులు—అందుకే ఈ సెషన్ ప్రజల్లో మంచి పేరు తెచ్చుకునే అవకాశం అని తెలిపారు. మొత్తంగా 164 మంది కూటమి ఎమ్మెల్యేలు సభలో చురుకుగా పాల్గొని తమ గళం వినిపించాల్సిందేనని చంద్రబాబు స్పష్టం చేశారు

