బ్యూటీగా ఉన్నారు, సిగరెట్ మానేయండి

ఈజిప్టులోని షర్మ్ ఎల్‌ షేక్‌లో జరిగిన ప్రపంచ శాంతి సదస్సులో ఊహించని సరదా సన్నివేశం చోటు చేసుకుంది. టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్, ఇటలీ ప్రధాన మంత్రి జార్జియా మెలోనీతో సరదాగా మాట్లాడిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఎర్డోగాన్ నవ్వుతూ మెలోనీకి స్వాగతం పలికి, మీరు విమానం దిగుతుండగా చూశాను… చాలా అద్భుతంగా కనిపించారని. అన్నారు. వెంటనే చమత్కారంగా మీరు సిగరెట్ తాగడం మానేస్తే ఇంకా బాగుంటుందని అన్నారు. పక్కనే ఉన్న ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్ కూడా నవ్వుతూ… అది అసాధ్యమని జోక్ చేశారు.
మెలోనీ కూడా వెంటనే స్పందిస్తూ నవ్వుతూ నాకు తెలుసు… నేను ఎవర్నీ చంపాలని అనుకోవడం లేదు..అని సమాధానమిచ్చారు. గతంలో 13 ఏళ్ల పాటు పొగతాగడం మానేసి, ఈ మధ్యే తిరిగి మొదలుపెట్టిన విషయాన్ని మెలోనీ ఒక ఇంటర్వ్యూలో చెప్పిన సంగతి తెలిసిందే.
ఈ వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు ఎర్డోగాన్ ఫన్నీగా మాట్లాడారని అంటుంటే, మెలోనీ నిజంగానే సిగరెట్ మానేస్తే బాగుంటుందని మరికొందరు కామెంట్ చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *